తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ప్రభావంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకతలు

నిత్యం కల్యాణాలతో పచ్చతోరణంలా బాసిల్లే తిరుమల క్షేత్రంలో.. కరోనా కల్లోలంతో ఈ ఏడాది వివాహాల కళ తప్పింది. సంవత్సరానికి ఏడు వేలకు పైగా వివాహాలు జరిగే తిరుమల క్షేత్రంలో.. 6 నెలలుగా పురోహిత సంఘంలో ఒక్క వివాహమూ నమోదు కాలేదు. పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో పెళ్లిల్లు చేసుకోవచ్చని కేంద్రం అనుమతులు ఇచ్చినా.. శ్రీనివాసుని సన్నిధిలో వివాహాలకు తితిదే నిరాకరిస్తోంది.

కరోనా ప్రభావంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం
కరోనా ప్రభావంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం

By

Published : Oct 10, 2020, 9:51 AM IST

కరోనా ప్రభావంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం

తిరుమలేశుని సన్నిధిలో.. ఆయన ఆశీస్సులతో వివాహ జీవితాన్ని ప్రారంభించాలని వధూవరులు ఎంతో ఆశపడతారు. నిత్య వధూవరులైన శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామివారికి నిత్యం కల్యాణం నిర్వహించడం.. వేద మంత్రోచ్చరణలు, గోవింద నామస్మరణలు ఘోషించే.. దివ్యక్షేత్రంలో పెళ్లి జరిగితే.. సుఖసంతోషాలతో జీవించవచ్చేది వారి విశ్వాసం. ఏడుకొండలవాడి సన్నిధిలో ఏటా ఏడువేలకు పైగా పెళ్లిల్లు జరుగుతుంటాయి. పేదలతో పాటు సంపన్నులు కూడా వివాహ శుభకార్యాలు జరుపుకునేలా ఇక్కడ వసతులున్నాయి. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా.. పురోహిత సంఘంలో వివాహాలు నిర్వహిస్తారు. పురోహితుడితో పాటు.. బాజా భజంత్రీలను ఉచితంగా తితిదే కల్పిస్తోంది. నూతన దంపతులతో పాటు వారి తల్లితండ్రులకూ శ్రీవరి దర్శనం కల్పిస్తూ వస్తోంది. వివాహాలను ఘనంగా నిర్వహించాలనుకునే వారి కోసం.. తితిదే కల్యాణ మండపాలతో పాటు.. కొండపై ఉన్న మఠాలలోనూ సౌకర్యాలున్నాయి.

వేలాది వివాహాలతో కళకళలాడుతుండే ప్రాంతంలో.. కరోనా కారణంగా మార్చి నెల నుంచి వవాహాలు ఊసే లేదు. నూతన దంపతులు, బంధువులతో సందడిగా ఉండే పురోహిత సంఘం ఆరేడు నెలలుగా బోసిపోయింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా వివాహాలు జరుపుకునేందుకు కొన్ని షరతులతో కేంద్రం మార్గదర్శకాలిచ్చినా.. పురోహిత సంఘంలో పెళ్లిల్లు నిర్వహించుకునేందుకు తితిదే అనుమతి ఇవ్వడం లేదు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో కొండపైకి అనుమతిస్తున్నారు. వివాహాలకూ అనుమతి ఇవ్వాలని భక్తులతో పాటు.. పెళ్లిల్లు నిర్వహించే గుత్తేదారులు, సిబ్బంది కోరుతున్నారు.

అధిక ఆశ్వీయుజ కార్తీక మాసంలో శుభ ముహూర్తాలు ఉన్నందున.. వివాహాలకు అనుమతి ఇవ్వాలన్న... పురోహిత సంఘం విజ్ఞప్తిపై తితిదే ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:నేడు కేబినెట్ భేటీ.. చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details