ఏపీలోని తాడిపత్రిలో ఎక్స్అఫీషియో ఓటుకు ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే అర్హత ఉన్నట్టు అక్కడి మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన నలుగురు ఎమ్మెల్సీలకూ అవకాశం లేదని స్పష్టం చేశారు.
'ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో అర్హత లేదు' - ex officio votes issue in ap
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి ఎక్స్అఫీషియో ఓటు అర్హత లేదని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తు చేశారని వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు మాత్రమే ఎక్స్ అఫిషియో ఓటుకు అవకాశం ఉందని చెప్పారు.
ex officio votes in tadipathri news
ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని చెప్పారు. ఈ కారణంగా.. తాడిపత్రిలో ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తును తిరస్కరించామన్నారు. దరఖాస్తు చేసిన ఇతర ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్, శమంతకమణికి సైతం అవకాశం లేదని చెప్పారు.
ఇదీ చూడండి:సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగం