తెలంగాణ ప్రభుత్వ రైతు విధానం దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా కేంద్రం సాయమేం అందించలేదని విస్మయం వ్యక్తం చేశారు. రూ. 25 వేల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామన్నారు.
రుణమాఫీ కోసం ఆర్థికశాఖ రూ.1,200 కోట్లు విడుదల చేసిందని వెల్లడించిందన్నారు. 5.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల కోసం పనిచేస్తున్న సీఎంపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం ఉద్ధరించారో చెప్పాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లి పరిశీలించడానికి తాము సిద్ధమన్నారు. మద్దతు ధరకు అన్ని పంటలు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వివరించారు.
కేంద్రం వినతుల్ని పట్టించుకోవట్లేదు...