హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం న్యాయకళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. ఫీజు చెల్లించలేదన్న కారణంతో పరీక్షకు అనుమతించలేదంటూ... గేటు ముందు బైఠాయించారు. కళాశాల నిధులను ప్రిన్సిపల్ అరుణ దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ను ప్రశ్నించినందుకే పరీక్షకు అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు రాస్తున్న మిగితా విద్యార్థులను కూడా బయటకు పంపించి విద్యార్థులు పరీక్షను బైకాట్ చేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు కళాశాలలో గందరగోళం నెలకొంది.
కళాశాలకు రాకుండా, ఫీజు చెల్లించకుండా పరీక్షకు ఎలా అనుమతిస్తారు?