తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ బిల్లుతో పేద విద్యార్థులకు అన్యాయం: వైద్యులు

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిమ్స్​ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. కేంద్రం నెక్స్ట్‌ పరీక్షను తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. 50% సీట్ల ఫీజుల పెంపు నిర్ణయాన్ని కళాశాలలకు వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

nims

By

Published : Jul 31, 2019, 10:59 AM IST

జాతీయ వైద్య కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్దింది. ఈ నేపథ్యంలో నిమ్స్​లో వైద్యులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 50% సీట్ల ఫీజుల పెంపు నిర్ణయాన్ని కళాశాలలకు వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల పెంపు కారణంగా ప్రైవేటు వైద్య కళాశాల్లో పేదలకు చోటు దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆ బిల్లుతో పేద విద్యార్థులకు అన్యాయం: వైద్యులు

ABOUT THE AUTHOR

...view details