నంబ రేమండ్... సైకాలజీ వైద్యవిద్య కోసం ఇండియాకు వచ్చాడు. పుణేలో ఉంటూ వక్ర బుద్ధితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. దీనికి ఓ టీం ఏర్పాటు చేసుకుని... ఏకంగా అమెరికా ఆర్మీ అధికారినంటూ ఫేస్బుక్లో యువతి, యువకులను నమ్మిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నాడు.
అమ్మాయిలా నటిస్తూ మోసం, నైజీరియన్ అరెస్ట్ - NIGERIAN ARREST
ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వచ్చాడు. వక్రబుద్ధితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఏకంగా అమెరికా ఆర్మీ అధికారినంటూ సోషల్ మీడియాలో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నైజీరియన్. అమ్మాయిగా నటిస్తూ ప్రేమ పేరుతో హైదరాబాద్ యువకులను మోసం చేస్తున్నాడు. ఎట్టకేలకు ఆ నైజీరియన్ ఆగడాలకు చెక్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు.
అంతేకాదు ఫేక్ అకౌంట్ ద్వారా యువకులకు ప్రేమ పేరుతో వల వేశాడు. ఇలా మెట్రో నగరాల్లోని యువకులనే టార్గెట్ చేస్తూ... సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మద్ ఇనాయత్ అలీ అనే వ్యక్తి వద్ద ఈ నైజీరియన్ అమ్మాయిలా నటించి ప్రేమ మాయలో పడేసి అతని నుంచి రెండు లక్షల్ని కాజేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అలీ ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగారు. ఫేక్ ఐడి, ఫోన్ కాల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా పూణేలో ఉన్న నైజీరియన్ నంబ రేమాండ్ లొకేషన్ గుర్తించి అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ తరహా నేరాలు ఇతని ఖాతాలు మరెన్నో ఉన్నాయని... వాటి వివరాలు సేకరించి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:ఔటర్‌పై రెండు కార్లు ఢీ... ఏడుగురికి గాయాలు
TAGGED:
NIGERIAN ARREST