NIA Officials Conducted Search at Hyderabad : జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency) అధికారులు తమిళనాడు, తెలంగాణలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. 31 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో కీలక పత్రాలు, ఉగ్రవాద సాహిత్యం, మొబైల్స్, లాప్‌టాప్‌లతో పాటు రూ.60 లక్షల నగదు.. 18,200 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్(Coimbatore Bomb Attack Case) లో గతేడాది అక్టోబరులో జరిగిన కారు బాంబు దాడి కేసులో భాగంగా ఎన్ఐఏ(NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా పలువురు ఐసిస్ సానుభూతిపరులు ముఠాగా ఏర్పడి అమాయక యువకులను ఆకర్షిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు.
Coimbatore Bomb Attack Case : మదర్సాల పేరుతో యువకులకు వాట్సాప్, టెలిగ్రామ్‌లలో లింకులు పంపి ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ.. ఐసిస్ సాహిత్యాన్ని బోధిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కోయంబత్తూరులో కారు బాంబు దాడి కేసులో ఎన్ఐఏ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. వాళ్ల మొబైళ్లు, లాప్టాప్లను విశ్లేషించినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూర్ లో 22చోట్ల, చెన్నై 3, టెంకాసీలో 1, హైదరాబాద్, సైబరాబాద్‌లో 5చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఎర్రకోట ఉగ్రదాడి దోషికి ఉరే సరి... సుప్రీం కోర్టు ఫైనల్ డెసిషన్..!
Terrorist conspiracy foiled in Hyderabad :గతేడాది హైదరాబాద్ జంటనగరాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ కేంద్రంగా జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం కశ్మీర్ నుంచి గ్రనేడ్లను తీసుకువచ్చి.. అలజడి సృష్టించాలని భావించారు. కానీ ఎక్కడ విధ్వంసం సృష్టించాలని వారికి పాకిస్థాన్ నుంచి సందేహం అందకపోవడం.. వెంటనే ఎన్ఐఏ ఈ కుట్రను భగ్నం చేయడంతో పెను ప్రమాదమే తప్పింది. హిందూ పండగలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రహస్యంగా ఆపరేషన్ చేసి జాహెద్, సమీయుద్దీన్, హసన్ ఫారూక్‌లను అరెస్టు చేశారు.