విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు
విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు
18:32 May 15
విశాఖ
విశాఖఫట్నంలో నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ఎన్ఐఏ ప్రధాన కుట్రదారుడిని అరెస్టు చేసింది. ఈ కేసులో నౌకాదళ సిబ్బంది సహా 11 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. ముంబయికి చెందిన మహ్మద్ హరూన్ హాజీని ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంది.
యుద్ధ నౌకలు, జలాంతర్గాముల రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడని ఎన్ఐఏ తెలిపింది. నిందితుడి నుంచి సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుంది.
ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!
Last Updated : May 15, 2020, 7:22 PM IST