తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాఫిక్​ నియంత్రణకు నూతన సిగ్నలింగ్​ వ్యవస్థ

మనం ఇంత వరకు ట్రాఫిక్​ సిగ్నల్స్​ను ప్రధాన కూడళ్ల వద్ద స్తంభాలపైనే చూశాం. కానీ రహదారిపై ఉండే స్టాప్​ లైన్ల పైనా సిగ్నల్స్​ కనిపించేలా భాగ్యనగర ట్రాఫిక్​ పోలీసులు ఏర్పాటు చేశారు. అనలాగ్​, డిజిటల్​ ల్యాబ్​ సహకారంతో వీటిని జూబ్లీహిల్స్​లోని కేబీఆర్​ పార్కు కూడలి వద్ద ప్రయోగాత్మకంగా ఉంచారు. వీటి పనితీరు ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నారు.

ట్రాఫిక్​ సిగ్నల్స్​

By

Published : Jul 1, 2019, 3:47 PM IST

Updated : Jul 1, 2019, 4:03 PM IST

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సిగ్నలింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు తెస్తున్నారు. కూడళ్ల వద్ద వాహనాలను నియంత్రించడానికి సిగ్నల్స్​ను మెరుగుపరుస్తున్నారు. ఇప్పటి వరకు కూడళ్ల వద్ద ఉన్న స్తంభాలపైనే సిగ్నల్స్ కనపడేవి. కానీ ఇప్పుడు రహదారిపైన ఉండే స్టాప్ లైన్ల పైనా సిగ్నల్స్ కనిపించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్​లోని కేబీఆర్​ పార్కు కూడలి వద్ద అధునాతన సిగ్నలింగ్​ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక ప్రాంతానికే పరిమితమైన వీటిని పనితీరు ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నారు. అనలాగ్​, డిజిటల్​ ల్యాబ్​ సహకారంతో ఈ సిగ్నలింగ్​ వ్యవస్థను చేపట్టారు.

ట్రాఫిక్​ సిగ్నల్స్​లో అధునాతన వ్యవస్థ
Last Updated : Jul 1, 2019, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details