సచివాలయం నుంచి శాఖల తరలింపునకు రంగం సిద్ధమైంది. కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నందున ప్రస్తుత భవనాలు వచ్చే నెల 5 నుంచి ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. కార్యాలయాలకు గదుల కేటాయింపుపై రోడ్లు భవనాల శాఖ రూపొందించిన ప్రణాళిక సాధారణ పరిపాలనశాఖకు ప్రణాళిక అందించింది. దీన్ని సాధారణ పరిపాలనశాఖ ఆయా శాఖలకు పంపింది. సాంకేతిక కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీఆర్కే భవన్‌లో మరమ్మతులు చేస్తున్నారు.
బీఆర్కే భవన్‌లో మంత్రులకు కార్యాలయాల కేటాయింపు - sachivalayam
కొత్త సచివాలయం నిర్మిస్తున్నందున ప్రస్తుత భవనాలు ఖాళీ చేయాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయాలకు గదుల కేటాయింపుపై రోడ్లు భవనాల శాఖ ప్రణాళిక రూపొందించి సాధారణ పరిపాలనశాఖకు అందించింది.
బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని మొదటి అంతస్తులో 8 మంది, తొమ్మిదో అంతస్తులో ముగ్గురు మంత్రులకు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. తొమ్మిదో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు, సాధారణ పరిపాలనశాఖ కార్యాలయాలు ఉంటాయి. మూడో అంతస్తులో సంక్షేమ శాఖలు, నాలుగో అంతస్తులో ఐటీ, రెవెన్యూ, ఆరో అంతస్తును నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఆర్థికశాఖ కార్యాలయాలు ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. కింద అంతస్తులో ప్రత్యేక భద్రత దళం ఉంటుంది.
ఇదీ చూడండి: 'ఎర్రమంజిల్ భవనాలు వారసత్వ సంపద కాదు'