కాంగ్రెస్ పేదలకు భూములపై హక్కులు కల్పిస్తే... కేసీఆర్ ఆ హక్కులను తొలగిస్తున్నారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'ప్రభుత్వం చేపట్టిన భూముల రికార్డుల సవరణ - దాని పరిణామాలు' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం గ్రామాల్లో రక్తపాతానికి దారి తీస్తోందని విమర్శించారు. భూ సర్వేలు చేయకుండా రికార్డుల ప్రక్షాళన చేయడం వల్ల అసైన్డ్ భూములు, ఇనాం భూములు పొందిన యజమానులు హక్కులు కోల్పోతున్నారన్నారు. కేసీఆర్ మళ్ళీ భూస్వామ్య వ్యవస్థను తీసుకువస్తున్నారని... ఈ వ్యవహారంపై శాసనసభ వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ భారత రాజ్యాంగం, పార్లమెంట్ ప్రాక్టీసెస్ పుస్తకాలను చదవాలని తెదేపా సీనియర్ నేత చంద్రశేఖరరెడ్డి సూచించారు. భూముల సర్వే సమగ్రంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
'కొత్త రెవెన్యూ చట్టం గ్రామాల్లో రక్తపాతానికి దారితీస్తోంది'
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములపై హక్కులు కల్పిస్తే... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హక్కులను తొలగిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గత చట్టాలను వెనక్కి నెట్టడానికే కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టారని ఆరోపించారు.
'కొత్త రెవెన్యూ చట్టం గ్రామాల్లో రక్తపాతానికి దారితీస్తోంది'