కొత్త పురపాలక చట్టం స్వల్ప సవరణతో గవర్నర్ ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులో గవర్నర్ ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. పట్టణ ప్రాంత స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సూచించేలా బిల్లులో పొందుపర్చారు. దీనిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ అంశాన్ని తొలగించి చట్టసవరణ చేశారు. ఒక సవరణతో కొత్త పురపాలక చట్టం గవర్నర్ నరసింహన్ ఆమోదం పొందింది. చట్టం బిల్లు, చట్టసవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.
గవర్నర్ ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం
తెలంగాణ పురపాలక చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఒక సవరణతో కొత్త పురపాలక చట్టం గవర్నర్ ఆమోదం పొందింది.
గవర్నర్ ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం