తెలంగాణ

telangana

ETV Bharat / state

ap covid cases: ఏపీలో కొత్తగా 671 కేసులు.. 11 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41,523 పరీక్షలు నిర్వహించగా.. 671 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,53,863 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ap covid cases
ap covid cases

By

Published : Oct 5, 2021, 10:35 PM IST

ఏపీలో గడిచిన 24 గంటల్లో 41,523 మందికి కరోనా పరీక్షలు (corona tests) నిర్వహించగా.. 671 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 1,272 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీ 9,141 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా కరోనా మృతులు..

కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...

అనంతపురంలో 9, చిత్తూరులో 102, తూర్పుగోదావరిలో 65, గుంటూరులో 91, కడపలో 9, కృష్ణాలో 66, కర్నూలులో 3, నెల్లూరులో 57, ప్రకాశంలో 74, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 52, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 109 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కొవిడ్​ కేసులు

ఇదీ చూడండి:దిగొస్తున్న కరోనా కేసులు- కొత్తగా 20వేల మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details