హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని చెత్తకుప్పలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన చంటి బిడ్డను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి వదిలివెళ్లారు. పసికందు ఏడుపు విన్న స్థానికులు చెత్తకుప్పలో పసికందును గుర్తించారు.అత్యవసర చికిత్స కోసం తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆడపిల్ల పుట్టడంతో వదిలేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఎవరు వదిలివెళ్లారన్న విషయంపై సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
అమానుషం: ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బిడ్డను చెత్తకుప్పలో పడేశారు - baby found in hyd
తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇంకా భారంగానే భావిస్తున్నారు. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే... కనికరం లేకుండా చెత్తకుప్పలో పడేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
అమానుషం: ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చంటి బిడ్డను వదిలేసిన తల్లి