తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫేక్ న్యూస్ వ్యాప్తిలో తెలంగాణ టాప్ - విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికం - తెలంగాణపై ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ 2022

NCRB Telangana State Report 2022 : తప్పుడు సమాచారం, వదంతుల ప్రచారం, వర్గాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ తరహా నేరాల్లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ- ఎన్‌సీఆర్‌బీ 2022 నివేదిక ప్రకారం గతేడాది దేశంలోని 19 మెట్రో నగరాల్లో ఈ తరహాలో సంబంధించి 97 కేసులు నమోదు కాగా ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 57 ఘటనలు రికార్డైనట్లు ఎన్‌సీఆర్‌బీ ప్రకటించింది.

NCRB Telangana State Report 2022
NCRB Telangana State Report 2022

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 8:46 AM IST

విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికం

NCRB Telangana State Report 2022 :జాతీయ నేర గణాంక బ్యూరో (NCRB Report 2022) విడుదల చేసిన లెక్కల ప్రకారం సైబర్‌ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నకిలీ వార్తల వ్యాప్తిలోనూ మొదటి స్ధానంలో ఉండడం కలకలం రేపుతోంది. వర్గాలు, సమూహాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టిన ఘటనలు నగరంలో ఎక్కువ సంఖ్యలో రికార్డ్‌ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో 41 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మెట్రో నగరాల్లో ఇదే అత్యధికం.

ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలు హైదరాబాద్‌ తర్వాతి స్థానంలోనే నిలిచాయి. అన్ని నగరాల్లో కలిపి 204 ఘటనలు నమోదయ్యాయి. దిల్లీ, కోయంబత్తూరులో మాత్రమే 20కి మించి కేసులు రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేష పూరిత వ్యాఖ్యలపై ప్రత్యేక నిఘా ఉంచడమే నగరంలో ఎక్కువ కేసులు నమోదు అవ్వడానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

NCRB : 'ఆన్​లైన్​ పిటిషన్‌లను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో తెలంగాణ నంబర్ వన్'

Telangana Top in Spreading Fake News Cases : ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు పోస్టులపై (Spreading Fake News) నిఘా ఉంచేందుకు సైబర్‌క్రైమ్, స్మాష్‌ పేరుతో ప్రత్యేక విభాగం పనిచేస్తోందని పోలీసులు తెలిపారు. ఎప్పటికప్పుడు తప్పుడు, విద్వేష వ్యాఖ్యల్ని గుర్తించి కేసులు నమోదు చేయడం వల్లే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనలపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. 2022లో తప్పుడు సమాచార వ్యాప్తిపై హైదరాబాద్‌లో 57, బెంగళూరులో 12, చెన్నైలో 10 కేసులు నమోదయ్యాయి.

తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించిన కేసులు నగరాల వారీగా : తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి ముంబయిలో 7, దిల్లీలో 5, అహ్మదాబాద్‌లో 2, పుణెలో ఒక కేసు నమోదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టి కేసులను చూస్తే హైదరాబాద్‌లో 41, దిల్లీలో 27, కోయంబత్తూరులో 25, ముంబయిలో 16, బెంగళూరులో 15, చెన్నై, కోల్‌కతాలో 14 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది.

భార్యలపై భర్తల క్రూరత్వంలో రాష్ట్రం అయిదో స్థానం

Telangana Tops in National Cyber Crime Cases :మరోవైపు ఇటీవల ప్రకటించిన ఎన్‌సీఆర్‌బీ 2022 నివేదికలో ఆర్థిక నేరాల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. సైబర్‌ నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 15,297 కేసులు నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. మోసాలకు సంబంధించి బ్యాకింగ్‌లో 3,223 నేరాలు నమోదు కాగా మొదటి స్థానంలో ఉంది. ఓటీపీ మోసాలకు సంబంధించి 2,179, చీటింగ్‌లో 4,467 కేసులు నమోదై తొలి స్థానంలో నిలిచింది.

Crime Incidents Grew in Telangana :ఏటీఎం మోసాల్లో 624 కేసులు నమోదుతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. బెదిరించి వసూళ్లకి సంబంధించి 447 కేసులతో మూడోస్థానంలో నిలిచింది. లైంగిక వేధింపుల కేసులు 152 నమోదయ్యాయి. ఇందులో దేశంలోనే రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. చోరీలకు సంబంధించి 15,854, 6650 వాహన చోరీల కేసులతో 8వ స్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో పేర్కొంది.

Loan App Harassment Hyderabad : లోన్​ యాప్​ డౌన్​లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రదర్​!

Cyber Crime Cases in Hyderabad : లైక్​ కొడితే రూ.200 అని ఆశచూపి.. రూ.59 లక్షలు దోచేశారు

ABOUT THE AUTHOR

...view details