Beauty of nature: విజయవాడ పరిసరాల్లో బుధవారం తెల్లవార జామున మంచుతెరలు కమ్ముకున్నాయి. తెల్లవారు జాము నుంచి మంచు కురుస్తుండడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. చెట్లపై కురిసిన మంచు చూపరులకు కనువిందు చేసింది. ప్రత్యేకించి రైలు ప్రయాణికులు కిటికీల నుంచి మంచు తెరల మధ్య ప్రకృతిని చూస్తూ మైమరచి పోయారు. కొందరు ఔత్సాహికులు సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. చీకట్లు తొలగినా విపరీతమైన మంచు కురుస్తుండటంతో తెల్లవారు జాము నుంచి మసక వెలుతురులోనే లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించాల్సి వచ్చింది.
ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే అందాలు.. ఇప్పుడు మీ కోసం..! - తెల్లవారుజామున విపరీతమైన మంచు
Beauty of nature: తెల్లవారు జాము నుంచి విజయవాడలోని పరిసరాల్లో మంచు కమ్మేసింది. దీంతో ఈ అందాల్ని ప్రకృతి ప్రేమికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. రైలు ప్రయాణం చేస్తూ, ప్రకృతి అందాల్ని చూస్తూ మైమరచిపోయారు. మీరు కూడా ఆ అందాలను చూసేయండి.
Beauty of nature