తెలంగాణ

telangana

ETV Bharat / state

నత్తనడకన యాసంగి.. - govt

గతంతో పోలిస్తే ఈసారి యాసంగిలో సాగు విస్తీర్ణం 21 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

యాసంగి సాగు

By

Published : Feb 14, 2019, 6:05 AM IST

Updated : Feb 14, 2019, 9:46 AM IST

యాసంగి సాగు
రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ఇంకా పుంజుకోలేదు. మరో నెలన్నరలో రబీ సీజన్ ముగుస్తున్నా.. ఇప్పటికీ అన్ని పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా 21 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ఈ యాసంగి పంట కాలంలో సాధారణ విస్తీర్ణం 13.38 లక్షల హెక్టార్లకుగాను ఇప్పటి వరకు 10.55 లక్షల హెక్టార్లలోనే విత్తనాలు, నాట్లు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి మరో లక్షా 46 వేల హెక్టార్లు సాగవడం గమనార్హం. ఆహార ధాన్యాల సాగు 84, నూనెగింజల పంటల సాగు 66 శాతం విస్తీర్ణంలో ఉంది. సెనగ పంట ఒక్కటే 100 శాతం కన్నా అధికంగా వేయటం వల్ల పప్పుధాన్యాల సాగు 3 శాతం పెరిగింది.

గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 855.1 మిల్లీమీటర్లకుగాను 720.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా జిల్లాల్లో సాధారణం కన్నా 20 నుంచి 45 శాతం దాకా వర్షపాత లోటు ఏర్పడింది. వర్షాలు లేనందున భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. నీటి కొరత వల్ల వరి సాగు అంతంత మాత్రంగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల యాసంగి సాగు నత్తనడకన సాగుతోందని వ్యవసాయాధికారులు తెలిపారు.

Last Updated : Feb 14, 2019, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details