తెలంగాణ

telangana

ETV Bharat / state

'అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు' - k ramulu

షెడ్యూల్ కులాల అభివృద్ధిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు హైదరాబాద్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో హైదరాబాద్​ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

'అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు'

By

Published : Aug 13, 2019, 11:01 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని కలెక్టరేట్​లో షెడ్యూల్​ కులాల అభివృద్ధిపై జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యుడు కె.రాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్లను ఎక్కువమొత్తంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో హైదరాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. స్టేషన్​ బెయిల్ మంజూరు చేయడంలో కూడా వివక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై కలెక్టర్​, పోలీస్ కమిషనర్​ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.మానిక్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్​తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

షెడ్యూల్​ కూలాల అభివృద్ధిపై జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యుడు కె.రాములు సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details