తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో జాతీయ సెయిలింగ్ పోటీలు.. - HUSSAIN SAGAR

హైదరాబాద్ నగరం మరో వేడుకకు సిద్ధమయింది. నేటి నుంచి ఆరు రోజులపాటు హుస్సేన్​సాగర్​లో జాతీయ సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మధ్యాహ్నం 2.45 గంటలకు పోటీలను ప్రారంభించనున్నారు. 175 మంది సెయిలింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

పోటీల్లో పాల్గొననున్న 175 మంది సెయిలింగ్ క్రీడాకారులు

By

Published : Jul 1, 2019, 6:23 AM IST

Updated : Jul 1, 2019, 7:25 AM IST

నేటి నుంచి ఆరు రోజులపాటు హుస్సేన్​సాగర్​లో జాతీయ సెయిలింగ్ పోటీలు

భాగ్యనగరం మరో జాతీయ స్థాయి క్రీడల పోటీకి ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 7 వరకు హుస్సేన్​సాగర్​​లో 34వ జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలను డిఫెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాలకు చెందిన 175 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో యువతులు కూడా అధిక సంఖ్యలో పోటీ చేయనున్నారు. వయస్సు, బరువును బట్టి 8 కేటగిరీలుగా ఈ పోటీలు జరగనున్నాయి.

ఎంచుకునేది తక్కువే...

సెయిలింగ్ క్రీడాకారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని హుస్సేన్​సాగర్​లో సాధన చేస్తున్నారు. వినూత్నమైన ఈ ఆటను తక్కువ మంది ఎంచుకుంటారని.... నచ్చిన వాళ్లు వదిలిపెట్టరని సెయిలింగ్ క్రీడాకారులు తెలిపారు. ఈ క్రీడలో రాణించాలంటే ఈత కొట్టడం, సమయస్ఫూర్తి కూడా అవసరమని వారు పేర్కొన్నారు.

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఆటను అద్భుతంగా ఆడొచ్చని ఆటగాళ్లు వివరించారు. క్రీడాకారులు సెయిలింగ్ చేస్తూ నీటిలో మునిగిపోతే వారిని కాపాడేందుకు నాలుగు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సరదాగా సాయంత్రం సమయంలో ట్యాంక్​బండ్​కు వచ్చే వారికి సెయిలింగ్ క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి.

ఇవీ చూడండి : 'మహిళా అధికారిణిపై దాడి ఆటవిక చర్య'

Last Updated : Jul 1, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details