రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో 35,650 కేసులకు పైగా పరిష్కారమయ్యాయి. ఇందులో భాగంగా రూ.49.20 కోట్లు పరిహారంగా ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి ప్రకటించారు.
35 వేల కేసులు.. రూ.49 కోట్ల పరిహారం.. లోక్ అదాలత్ విజయవంతం..
రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయింది. 35,650 కేసులకు పైగా పరిష్కారమయినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి వెల్లడించారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్‌చీఫ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, హైకోర్టు న్యాయసేవాధికార కమిటీ ఛైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావుల సలహాలు, సూచనలతో లోక్‌అదాలత్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లోక్‌అదాలత్‌లో 512 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో మోటారు వాహనాల ప్రమాదాలకు చెందిన అప్పీళ్లు 478తో పాటు సర్వీసుకు చెందిన రిట్ పిటిషన్‌లు పరిష్కరించినట్లు కమిటీ కార్యదర్శి సీహెచ్.రమేశ్‌బాబు తెలిపారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ అభిషేక్‌రెడ్డిలు కేసులను విచారించి పరిష్కరించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:రాజీ మార్గమే రాజమార్గం.. లోక్ అదాలత్‌తో సమస్య పరిష్కారం