MLA Roja Playing Kabaddi: తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో వైకాపా ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. తిరుపతిలో మహిళల, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. మూడో రోజు ప్రారంభమైన ఈ క్రీడలను వీక్షించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా వచ్చారు.
జాతీయ స్థాయి క్రీడలు తిరుపతిలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు క్రీడలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు. తెలుగు భాష, సంస్కృతితో పాటు క్రీడల నిర్వహణకు అత్యంత చొరవ చూపిన తిరుపతి ఎమ్మెల్యేను ఆయన అభినందించారు.