తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీలో విచారణ

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ సహా ప్రతివాదులకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

national green tribunal hearing on secretariat demolished
సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీలో విచారణ

By

Published : Jul 16, 2020, 3:33 PM IST

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే కూల్చివేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాందించారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టులో విచారణ సాగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల వాదన విన్న ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టులో విచారణ తర్వాత వాదనలు వింటామని చెప్పింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details