సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యంగా సాగుతున్నట్లు నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేటలో రెండు రోజులపాటు సాగే నాబార్డు డీడీఎమ్ల జోనల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి నాబార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎమ్‌లు వై.కే. రావు, జన్నవార్ హాజరయ్యారు.
తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం - హైదరాాబాద్ వార్తలు
నాబార్డు డీడీఎంల జోనల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యంగా ముందు వెళ్తున్నామని నాబార్డు ఛైర్మన్ తెలిపారు.
తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం