తెలంగాణ

telangana

పాపం పండింది... ఆ దొంగబాబా ఇలా బుక్కయ్యాడు!

చేతబడి చేశారని.. నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అమాయకుల దగ్గర దొరికిన కాడికి దోచేశాడు. పాపులారిటీ కోసం దెయ్యం పట్టిన వ్యక్తికి నయం చేస్తున్నానంటూ ఓ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

By

Published : Sep 22, 2019, 11:38 PM IST

Published : Sep 22, 2019, 11:38 PM IST

తన గోతిని తానే తవ్వుకున్న దొంగబాబా

తన గోతిని తానే తవ్వుకున్న దొంగబాబా

హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని ఆలం పోలీసులు ఈ రోజు ఓ దొంగబాబాని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ టిప్పు సుల్తాన్ అలియాస్ టిప్పు బాబాగా చలామణీ అవుతూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీకు చేతబడి చేశారు, నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పి ప్రజల దగ్గర నుంచి దొరికినకాడికి దోచుకున్నాడు. పాపులారిటీ కోసం దెయ్యం పట్టిన వ్యక్తికి నయం చేస్తున్నానంటూ ఓ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. పాతబస్తీకి చెందిన ఎండీ జావీద్ ఈ వీడియోని వీక్షించాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details