సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఉపసంహరించుకునే వరకు ఆందోళనను కొనసాగిస్తామని జేఏసీ ముస్తాక్ అలీ తెలిపారు. జేఏసీ చేపట్టిన ఈ ధర్నాకు నగర నలు మూలల నుంచి వేలాది మంది ముస్లింలు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు.
'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు' - పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికకు వ్యతిరేకంగా ముస్లింలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే నిరసన కొనసాగిస్తామని వెల్లడించారు.
'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'
కేంద్రప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టిందని... రానున్న కాలంలో మరొక మతాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. మతాలకు అతీతంగా అందరూ దీనిని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో సిఏఏను వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన