Musi Floods: హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ శ్మశాన వాటికను వరద ముంచెత్తింది. అంత్యక్రియలు చేసే ప్రదేశంలో జలాలు చుట్టుముట్టాయి. నదిని ఆనుకునే ఉన్న స్మశాన వాటిక ప్రహారీ గోడపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దహన వాటికలు ముంపునకు గురికావడంతో అంత్యక్రియలు చేసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద తగ్గితే తప్పా మళ్లీ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
Musi Floods: వైకుంఠధామాన్ని ముంచెత్తిన వరద
Musi Floods: హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. దాంతో పురానాపూల్లోని స్మశానవాటికకు వరద వచ్చి చేరింది. ఫలితంగా అంత్యక్రియలు చేసుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.
మూసీ