సికింద్రాబాద్‌లోని వారసిగూడ నివాసి దత్తు తన భార్య గర్భిణీ శోభను సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో నొప్పులతో వాహనంపై కూర్చోలేక తీవ్ర ఇబ్బంది పడుతూ దిగి రోడ్డుపై కూర్చుండిపోయింది. ఈ ఘటనను చూసిన ఓ క్యాబ్ డ్రైవర్ వెంటనే వారికి ముషీరాబాద్ చౌరస్తా వరకు లిఫ్ట్ ఇచ్చాడు.
నిండు గర్భిణీని సమయానికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు - corona update
లాక్డౌన్ సమస్య అన్ని వర్గాల ప్రజలతో పాటు రోగులనూ తీవ్ర ఇబ్బంది పెడుతోంది. వాహనాల కొరత వల్ల ప్రధానంగా గర్భిణీలు తీవ్రంగా బాధపడుతున్నారు. నగరంలో ఆస్పత్రికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఓ గర్భిణీకి పోలీసులు సమయానికి సాయం చేశారు. సురక్షితంగా ఆస్పత్రికి చేర్చి ప్రశసంలు పొందారు.
నిండు గర్భిణీని సమయానికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
తనకు పోలీసుల అనుమతి లేదని అంతకంటే ముందుకు వెళ్లలేనని డ్రైవర్ చెప్పాడు. ముషీరాబాద్ చౌరస్తాలో గర్భిణీ శోభను కారు నుంచి దింపుతున్న సమయంలో ఎస్సై రామారావు గుర్తించారు. వెంటనే ఆ గర్భిణీ వద్దకు వెళ్లి పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో సురక్షితంగా సనత్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. సమయానికి ఆదుకున్న పోలీసులకు గర్భిణీ భర్త దత్తు ధన్యవాదాలు తెలిపారు.