ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్ దంపతులు.. కరోనా సంక్షోభంలో ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న డివిజన్ ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తూ చేయూతనందిస్తున్నారు. కరోనా రోగులకు.. మందులతో పాటు పోషకాలు కలిగిన భోజనాన్ని అందిస్తున్నారు.
పేదలకు అండగా నిలుస్తోన్న మహిళా కార్పొరేటర్ - కరోనా సంక్షోభంలో సంఘ సేవకులు
కొవిడ్ కష్టకాలంలో మానవతావాదులు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు అండగా నిలుస్తున్నారు. ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్ దంపతులు.. డివిజన్లోని పేదలకు నిత్యావసరాలు అందిస్తూ చేయూతనందిస్తున్నారు.
ముషీరాబాద్ కార్పోరేటర్
కరోనా విజృంభణ దృష్ట్యా.. డివిజన్‌లో ప్రతి రోజు శానిటైజేషన్ చేయిస్తున్నామని సుప్రియ తెలిపారు. ఎంఎస్‌ఆర్ ఫౌండేషన్ సాయంతో.. కొవిడ్ పేషెంట్లకు మందులతో పాటు ప్రతి రోజు మటన్, చికెన్, గుడ్డు, పప్పు, సాంబార్ వంటి ప్రొటీన్ ఫుడ్‌ను అందిస్తున్నట్లు వివరించారు. కష్ట కాలంలో మానవతవాదులంతా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కాళ్లకు బొబ్బలెక్కినా.. నడక ఆగదు..