చనిపోయాడా?... చంపేశారా? - ASIFABAD
అది నిర్మాణంలో ఉన్న భవనం.. నీటి సంపులో ఓ మృతదేహం... మృతుడు భవన నిర్మాణ కార్మికుడే... మరి అతను ఎలా చనిపోయాడు. చనిపోయాడా..? ఎవరైనా చంపేశారా...?
అనుమానాస్పద స్థితిలో మృతదేహం
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనపు నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కైలాశ్గా స్థానికులు గుర్తించారు. జిర్రాలో నివాసముంటున్న కైలాశ్.. భవన నిర్మాణ కార్మికుడే కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.