ఆస్తి హక్కు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
ప్రభుత్వం తన అధికారాలను ఏకపక్షంగా చెలాయిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల హక్కులు, ప్రభుత్వ అధికారాల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొంది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి భంగం కలిగించే ముందు వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.
మున్సిపల్ చట్టంపై.. కౌంటరు దాఖలు చెయ్యండి
అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడుతూ... తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై.. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11కి హైకోర్టు వాయిదా వేసింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ
ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178(2)ను సవాలు చేస్తూ.. దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178(2) ఒక్కదాన్ని విడిగా చూడరాదని... దీన్ని సెక్షన్ 174(4)తో కలిపి చూడాలంది.
ఈ సెక్షన్ ప్రకారం చట్ట విరుద్ధంగా నిర్మాణం చేపట్టమని హామీ ఇస్తారని.. అయితే ఆ తరువాత మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తే ఏకపక్షంగా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించింది. ఉరి తీసేవాడికీ అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది .
న్యాయస్థానంలో విచారణ జరిగిన తీరు..
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది :
ఈ చట్టం వల్ల ఎవరూ నష్టపోలేదని, ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద దీన్ని విచారించడం సరికాదన్నారు. హామీకి విరుద్దంగా ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించినప్పుడు మాత్రమే.. కూల్చివేయడానికి అధికారం ఉంటుందన్నారు.
ధర్మాసనం :
సాంకేతిక కారణాలను చూపడం సరికాదు, ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో ఎవరైనా రావచ్చు.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ :