తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. పలు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇంకొన్ని చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు నిరసనకు దిగారు.

municipal elections polling in telangana
పుర పోలింగ్​కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

By

Published : Jan 22, 2020, 10:17 AM IST

రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల పోలింగ్‌ చెదురుమొదురు ఘటన మధ్య కొనసాగుతోంది.

ఆలస్యం.. ఓట్లు గల్లంతు

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 7వ వార్డు 13వ పోలింగ్‌ కేంద్రంలో అరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.
మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో 15వ వార్డులో 100 ఓట్లు గల్లంతయ్యాయి. గుర్తింపు కార్డులతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్లు... ఓట్లు లేకపోవడం వల్ల తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం లోపు ఓట్ల వివరాలు వెల్లడిస్తామని పోలింగ్ అధికారులు తెలిపారు.

ఘర్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పోలీసులు, స్థానిక నేత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు తనపై దాడి చేశారని వెంకట్​ గౌడ్​ ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇల్లెందు 13వ వార్డులో ఒక ఇంట్లో రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

గద్వాలలో కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గద్వాల మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లాఠీఛార్జ్​తో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనా స్థలిని గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లా మంథని 3వ వార్డులో తెరాస, ఫార్వర్డ్ బ్లాక్‌ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఓటేసిన ప్రముఖులు

సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, 44 వ వార్డులో మంత్రి జగదీశ్‌ రెడ్డి, మిర్యాలగూడలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. నల్గొండలో 33వ వార్డు పోలింగ్​లో ఎంపీ కోమటిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.

వనపర్తి 23 వ వార్డులో మంత్రి నిరంజన్‌రెడ్డి, హైదరాబాద్‌ కిస్మత్‌పూర్‌లో మండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఓటు వేశారు.

ABOUT THE AUTHOR

...view details