రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ కమిషనర్లుగా ఉన్న ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో కలిసి వేదికలను పంచుకోవడం, కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.
'ఎంపీడీవోలు పల్లె ప్రగతిలో పాల్గొనవద్దు'
రాష్ట్రంలో పురపాలక ఇన్ఛార్జ్ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీవోలు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమలు 'ఎంపీడీవోలు పల్లె ప్రగతిలో పాల్గొనొద్దు'
ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియామకానికి రాష్ట్ర ఎన్నికల అథారిటీ, పురపాలక శాఖ డైరెక్టర్‌కు అధికారాలు కల్పించింది.
ఇదీ చూడండి: పెన్సిల్‌పై హ్యాపీ న్యూ ఇయర్
Last Updated : Jan 1, 2020, 7:22 AM IST