తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయవ్యవస్థను బతికించుకోకుంటే... మనం బతకలేం' - ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ నియమించడాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్వాగతించారు. న్యాయ వ్యవస్థను బతికుంచుకోవాలని.. లేనిపక్షంలో అణగారిన వర్గాలు బతకలేవన్నారు.

mrps Founding President manda krishna on disha accused encounter
'న్యాయవ్యవస్థను బతికించుకోకుంటే... మనం బతకలేం'

By

Published : Dec 13, 2019, 5:51 PM IST

'న్యాయవ్యవస్థను బతికించుకోకుంటే... మనం బతకలేం'

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రాష్ట మంత్రి తలసాని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను త్రిసభ్య కమిటీ సాక్ష్యులుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ​కోరారు. ఎన్​కౌంటర్​పై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ నియామకాన్ని స్వాగతించారు. ​

న్యాయ వ్యవస్థను బతికుంచుకోవాల్సిన అవసరం బలహీన వర్గాలపై ఉందన్నారు. లేనిపక్షంలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనడానికి నిజమైన సాక్ష్యం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అని వ్యాఖ్యానించారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ.... అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అణగారిన వర్గాలకు మరో న్యాయమా అని మందకృష్ణ నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై నిరసన వ్యక్తం చేశారు.

ఈనెల 15 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మందకృష్ణ తెలిపారు. 24న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details