ఇటీవల కేంద్రం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తప్పుపట్టారు.ఈ విషయంపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఇస్తే బాగుండేదన్నారు.రక్షణశాఖకు బడ్జెట్ సరిపోకపోవడమనే విషయం లేదని, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులనే భద్రతా దళాలు పూర్తిగా వినియోగించట్లేదని తెలిపారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఈ నియమ నిబంధనలను మార్చారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ... ప్రాజెక్టులు వినియోగించుకొని రైతుల జీవితాలు బాగు పడితే... రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
రక్షణశాఖకు ప్రత్యేక కేటాయింపులు ఎందుకు...? - EX MP
15వ ఆర్థిక సంఘం గత రెండేళ్ల నుంచి అన్ని రాష్ట్రాలు తిరిగి నివేదికలను తయారు చేసుకొని అక్టోబర్లో సమర్పిస్తుందనే సమయంలో కేంద్రం నియమ నిబంధనలను మార్చడం సరికాదు: వినోద్ కుమార్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
రక్షణశాఖకు ప్రత్యేక కేటాయింపులు ఎందుకు...?