ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్‌గేట్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం కూర్మన్నపాలెం కూడలిలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.
'ఉక్కు' ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయి పాదయాత్ర - protest against vizag steel plant privaitisation
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రను చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లోని గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది.
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయి పాదయాత్ర
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.... పార్లమెంట్ లోపల, బయటా రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ