తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు కోట్ల ఒకటో మొక్క నాటిన ఎంపీ సంతోష్​ కుమార్​

హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్​ ప్రారంభించిన గ్రీన్​ ఇండియా ఛాలెంజ్...​ మూడు కోట్లకు చేరింది. పలువురు జాతీయ, రాష్ట్ర ప్రముఖులు, నేతలు, అధికారులు, క్రీడాకారులు, సినీనటులు పాల్గొనడం వల్ల ఈ ఛాలెంజ్​ విజయవంతంగా కొనసాగుతోంది.

MP SNTHOSH RAO PLANTED 3 CRORE ONE PLANT IN HYDRABAD

By

Published : Sep 13, 2019, 11:35 PM IST

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. మూడు కోట్ల ఒకటో మొక్కను ఎంపీ సంతోష్​ హైదరాబాద్ నెక్లెస్​రోడ్​లో నాటారు. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణా విభాగం శిక్షణా కేంద్రంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్​తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలతో నేతలు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకున్నారు.

పది కోట్ల మొక్కలే లక్ష్యం...

గ్రీన్ ఛాలెంజ్​లో పాల్గొనటం తన అదృష్టమన్న సంతోష్... హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామం కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత కూడా... తీసుకోవాలని కోరారు. పచ్చదనం పెరిగి తెలంగాణ అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మారాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా పది కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఇగ్నెటింగ్ మైండ్స్ సంస్థ ప్రతినిధి కరుణాకర్ రెడ్డి తెలిపారు.

మూడు కోట్ల ఒకటో మొక్క నాటిన ఎంపీ సంతోష్​

'గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​' అంటే....

హరితహారంలో తమ వంతు భాగస్వామ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను సంతోష్​ ప్రారంభించారు. తను మొక్క నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడమే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. కార్యక్రమంలో భాగంగా పలువురు జాతీయ, రాష్ట్ర ప్రముఖులు, నేతలు, అధికారులు, క్రీడాకారులు, సినీనటులు, వివిధ వర్గల వారు మొత్తం కలిసి ఇప్పటివరకు మూడు కోట్ల మొక్కలు నాటారు.

ఇవీ చూడండి: ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!

ABOUT THE AUTHOR

...view details