తెలంగాణ

telangana

ETV Bharat / state

వేప విత్తనం ఉన్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ - వేప విత్తనం ఉన్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌ పర్యావరణహిత విత్తన గణపతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేప విత్తనం ఉన్న మట్టి వినాయకుణ్ణి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. వాటిని ఆరోగ్య గణపతిగా పూజించాలని సంతోశ్‌ కోరారు. పలువురు ప్రముఖులకు ఆయన పంపిణీ చేశారు.

వేప విత్తనం ఉన్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
వేప విత్తనం ఉన్న మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

By

Published : Aug 21, 2020, 10:58 PM IST

పచ్చదనం పెంపు కోసం గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్... వినాయక చవితి వేళ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణహిత విత్తన గణపతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేప విత్తనం ఉన్న మట్టి వినాయకుణ్ణి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు.

కొబ్బరిపీచుతో చేసిన తొట్టిలోనే నిమజ్జనం చేయడం ద్వారా వేప మొలక వస్తుంది. ఆరోగ్య గణపతిగా పూజించాలని సంతోశ్‌ కోరారు. పలువురు ప్రముఖులకు ఆయన పంపిణీ చేశారు. సొంతంగా సంతోశ్‌ పదివేల విత్తన గణపతులను పంపిణీ చేయగా... రాష్ట్ర వ్యాప్తంగా తెరాస నేతలు రెండు లక్షల వరకు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ABOUT THE AUTHOR

...view details