కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి.. మరణం పట్ల మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వచ్చి పార్థివ దేహనికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజకీయాల్లో మచ్చలేని మనిషని.. ఆయన దేశానికి, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే వారికి జైపాల్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. పార్టీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు.
జైపాల్ రెడ్డి మరణం పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి - EX MP
"దివంగత నేత జైపాల్ రెడ్డి మరణం.. దేశానికి, పార్టీకి, తమ కుటుంబానికి తీరని లోటు. ఆయన జీవితం.. నేటి యువతకు ఆదర్శప్రాయం. దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి": రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ
జైపాల్ రెడ్డి మరణం పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి