ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే పోలీసు శాఖలో నిజాయితీ గల అధికారులు బాధపడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదవీవిరమణ పొందిన తన సామాజిక వర్గానికి చెందిన వారికి సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అప్పగించి ప్రతిపక్షాలను అణచడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
'కేసీఆర్ తీరుతో నిజాయితీ గల పోలీసులు అవస్థలు పడుతున్నారు' - revanth reddy on police department
పదవీ విరమణ పొందిన తన సామాజిక వర్గానికి చెందిన వారికి సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అప్పగించి ప్రతిపక్షాలను అణచడానికి ప్రయత్నిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రయివేటు సైన్యంలా పని చేసే అధికారులను ముఖ్యమైన స్థానాల్లో నియమిస్తున్నారని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపుల కోసం, టెలిఫోన్ ట్యాపింగ్‌ల కోసం, తప్పులు ఎత్తిచూపే నేతలపై కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై నిఘా పెట్టడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. వీకే సింగ్ లాంటి అధికారులు పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారని రేవంత్ చెప్పారు. ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న తన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఐపీఎస్‌లను తిరిగి కొనసాగించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్ రావు, డీఐజీ వెంకటేశ్వర రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాదాకిషన్ రావులు నెలాఖరుకు పదవీ విరమణ పొందనున్నారని.. కానీ వారిని అదే హోదాలో ఉచ్చేలా సీఆర్ ఫైల్ కదుపుతున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి:సమష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం: సీఎం