విద్యుత్ సెంటిమెంట్‌ను కేసీఆర్ నోట్ల మూటలుగా మార్చుకోడానికి ఉపయోగించుకుంటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదాని కంపెనీకి మేలు చేయడానికి తెలంగాణ ప్రజల మీద రూ.1200 కోట్ల భారాన్ని మోపారన్నారు. విద్యుత్ అమ్మేవాళ్లు కోనేవాళ్లు సిండికేట్‌గా మారి అత్యవసర కోనుగోళ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేస్తామని... విచారణ జరిపించడానికి లక్ష్మణ్, నడ్డా, కిషన్ రెడ్డి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు భాజపాను అడ్డుకునేది ఎవరిని ప్రశ్నించారు.
'ఆదాని కంపెనీకి మేలు చేయడానికే విద్యుత్ కొనుగోళ్లు' - electricity
విద్యుత్ కొనుగోలు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి జెన్కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు సహకరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.
'ఆదాని కంపెనీకి మేలు చేయడానికే విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు'