తన పార్లమెంటు నియోజకవర్గంలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చిట్యాల, జనగాం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌కు లేఖ రాశారు. ఇవాళ చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ వచ్చిన గోయల్‌కు కాంగ్రెస్ నేతలు ఆ లేఖ ప్రతిని అందజేశారు.
లేఖలో ఏముందంటే..!
భువనగిరి రైల్వే స్టేషన్‌లో శాతవాహన, పద్మావతి, కోాణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని.. తద్వారా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపార వర్గాలకు సౌకర్యవంతంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.