రేపటి నుంచి తన తడాఖా ఏంటో చూపిస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy Comments) స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. కేసీఆర్ ఇక రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రాణాలు కోల్పోయిన ఐలాపూర్ రైతు భీరయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన(Komatireddy Venkat Reddy Comments) మాట్లాడారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని పేర్కొన్నారు. సోనియా గాంధీని దేవతగా ఆయన అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు.
రేపటి నుంచి నా తడాఖా ఏంటో చూపిస్తా.: కోమటి రెడ్డి క్రేజ్ ఉందనుకున్నా
ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy Comments) తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మాణిక్కం ఠాగూర్ లాంటి పెద్ద నేతలు తెలంగాణకు వచ్చి 2023లో అధికారం మాదే అంటుంటే నిజమే అనుకున్నానని కోమటిరెడ్డి అన్నారు. తమ పార్టీలో పెద్ద పెద్ద నాయకులకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉందని భ్రమ పడినట్లు చెప్పారు. లేదంటే హుజూరాబాద్ ప్రచారానికి తానే వెళ్లేవాడినని చెప్పారు.
ఏపీలోనే అధిక ఓట్లు
ఏపీలో బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 6వేల ఓట్లు వచ్చాయని కానీ.. హుజూరాబాద్‌లో 3వేల ఓట్లే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయంటూ కొందరు తమకు 72 నుంచి 78 సీట్లు వస్తాయని పోర్ట్‌ఫోలియోలు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడినని.. రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసినట్లు కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy Comments) గుర్తు చేశారు. తనకు ఏ పదవి లేకున్నా.. ఎంపీ అనే పెద్ద పదవి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
మా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉందనుకున్న. నేను పెద్ద నాయకుడిని కాదని ఇంట్లో కూర్చున్న. లేదంటే నేనైనా ప్రచారానికి వెళుతుంటి. టికెట్లు కూడా పంచేశారు ఇక నాతో ఏం అవసరముందని.. హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదు. ఈ రోజు రైతు భీరయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా. రేపటి నుంచి నా తడాఖా ఏంటో చూపిస్తా. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, భువనగిరి
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy Comments). దుబ్బాక, నాగార్జునసాగర్‌లో పని చేసినట్లుగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదని విమర్శించారు. అక్కడి వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరిస్తానని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ఒక్క సభ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి క్యాడర్ ఉందని.. కార్యకర్తలను తమవైపునకు తిప్పుకోవడంలో ప్రయత్నించలేదని విమర్శించారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలైనా పార్టీ పట్టించుకోలేదని ఎంపీ మండిపడ్డారు.
ఇదీ చదవండి:Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!