తెలంగాణ

telangana

ETV Bharat / state

MP KOMATIREDDY: అస‌మ‌ర్థ పాల‌న‌కు వైద్యారోగ్య శాఖ దుస్థితే సాక్ష్యం - telangana varthalu

తెరాస అస‌మ‌ర్థ పాల‌న‌కు వైద్యారోగ్య శాఖ దుస్థితే సాక్ష్యమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. క‌రోనా మ‌హమ్మారిని లెక్క చేయ‌కుండా విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టులు, ఆరోగ్యమిత్రలు, ఏఎన్ఎంల స‌మ‌స్యలను వెంట‌నే ప‌రిష్కరించాలని డిమాండ్ చేశారు

komatireddy
komatireddy

By

Published : Jun 6, 2021, 4:41 PM IST

తెలంగాణలో తెరాస అస‌మ‌ర్థ పాల‌న‌కు వైద్యారోగ్య శాఖ దుస్థితే సాక్ష్యమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. వైద్య, ఆరోగ్య శాఖల సరిపడినంత సిబ్బంది లేక మెరుగైన వైద్యం చేయ‌ట్లేద‌ని నీతి ఆయోగ్ సైతం త‌న నివేదిక‌లో వెల్లడించినట్లు ఆయన ఆరోపించారు. వైద్య సిబ్బంది, మౌళిక వ‌స‌తుల్లో రాష్ట్రం చివ‌రి నుంచి మూడో స్థానంలో నిలిచిందని, తెరాస ఎంత గొప్పగా వైద్యం అందిస్తుందో.... దీనిని బ‌ట్టే తెలుస్తోందని విమర్శించారు.

వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది త‌రఫున ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్న ఎంపీ... ఇప్పటికైనా క‌రోనా మ‌హమ్మారిని లెక్క చేయ‌కుండా విధ‌ులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టులు, ఆరోగ్యమిత్రలు, ఏఎన్ఎంల స‌మ‌స్యలను వెంట‌నే ప‌రిష్కరించాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టుల‌ను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేసిన ఆయన... 2017లో టీఎస్‌పీఎస్సీ ద్వారా ప‌రీక్షలు పెట్టి మెరిట్‌లో వ‌చ్చిన వారిని ఇప్పటి వ‌ర‌కు రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌లోకి తీసుకోలేదని ఆరోపించారు.

2007లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియ‌మించిన ఆరోగ్య మిత్రల వేత‌నాలు ఇప్పటికీ పదివేలే ఉందని, వారికి వచ్చే జీతంతో స‌గ‌టు మాన‌వుడు జీవించ‌డం చాలా క‌ష్టమన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించి రూ.30వేలు రూపాయ‌లు వేత‌నంగా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా స‌మ‌యంలో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి ద‌గ్గరగా ఉండి ఎంతో సేవ చేస్తున్న ఏఎన్ఎం-2ల‌కు ఏఎన్ఎం-1తో స‌మానంగా వేత‌నం ఇవ్వాలన్నారు. వేతనాలు పెంచని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేప‌డుతామ‌ని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​వో గుర్తింపు : కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details