లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గత 20 రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు తగ్గించి ఊరటనివ్వాల్సిందిపోయి ధరలు పెంచడం దారుణమంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఆయన లేఖ రాశారు.
పెట్రోల్ ధరలపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ - mp komatireddy letter to president ramnath kovind
రాష్ట్రపతి కోవింద్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. పెట్రో ధరల పెంపు గురించి ఆ లేఖలో వివరించారు.
పెట్రోల్ ధరలపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
విపత్కర పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భాజపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోమటిరెడ్డి వివరించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!