ఎల్‌ఆర్‌ఎస్ గుదిబండలా మారిందని... తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వం మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.
ఎల్‌ఆర్‌ఎస్ గుదిబండలా మారింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇకనైనా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగించాలని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ గుదిబండలా మారింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కొత్త విధానంలో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయని విమర్శించారు. ఇకనైనా ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగించాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీ చూడండి:ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు హైకోర్టు ఆమోదం