గొలుసుకట్టు వ్యాపారంతో వివాదాల్లో చిక్కుకున్న క్యూనెట్ సంస్థకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ సంస్థతో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని... సంస్థ తరఫున తాము ప్రచారం చేయలేదని పలువురు సినీ ప్రముఖులు సైబరాబాద్ పోలీసులకు వివరణ ఇచ్చారు. క్యూనెట్ గతంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులు పాల్గొన్న అంశంపై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సినీ నటులు షారుఖ్‌ఖాన్, బొమన్‌ఇరానీ, వివేక్ఒబెరాయ్, పూజాహెగ్డే, అల్లు శిరీష్, క్రికెటర్ యువరాజ్సింగ్లకు తాఖీదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంస్థ తరఫున తాము ప్రచారం చేయలేదని వివరణ ఇచ్చారు. దీనిపై వాస్తవాలను సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
"క్యూనెట్"కు ప్రచారం చేయలేదు.. సినీనటుల వివరణ
క్యూనెట్"కు ప్రచారం చేయలేదని సినీనటులు వివరణ ఇచ్చారు. ఆ సంస్థకు తమకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.
క్యూనెట్ సంస్థ