తెలంగాణ

telangana

ETV Bharat / state

గత సీఎంలకు భిన్నంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారు: కిషన్​రెడ్డి

గతంలో ముఖ్యమంత్రులు.. ప్రజలు, ప్రజాసంఘాలను కలిసేవారని.. వారి సమస్యలను పరిష్కరించేవారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్​ మాత్రం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గత సీఎంలకు భిన్నంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారు: కిషన్​రెడ్డి
గత సీఎంలకు భిన్నంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారు: కిషన్​రెడ్డి

By

Published : Dec 27, 2020, 7:54 PM IST

ప్రజలు, ప్రజాప్రతినిధులను కలవకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిపాలన కొనసాగిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. హైదరాబాద్​ అబిడ్స్​లోని స్టాన్లీ కాలేజ్​ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్​ ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశానికి కిషన్​రెడ్డి హాజరయ్యారు.

తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు వ్యతిరేకంగా కేసీఆర్​ పనిచేస్తున్నారు. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన తెరాస.. ఉద్యమకారులను అణచివేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజలను, ప్రజా సంఘాలను కలుస్తూ... వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై గతంలో అసెంబ్లీలో చర్చ జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దుబ్బాక, జీహెచ్​ఎంసీలో భాజపా విజయం తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది.

- కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

గత సీఎంలకు భిన్నంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారు: కిషన్​రెడ్డి

ఇవీచూడండి:'వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు, నియంత్రిత సాగు ఉండదు'

ABOUT THE AUTHOR

...view details