ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు అధికమవడం వల్ల అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చింది. నిజాంపేటలో నివాసించే ప్రవీణ్ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య సుష్మ 9 నెలల గర్భవతి. తెల్లవారుజామున సుమారు 1: 30 నిమిషాలకు సుశ్మకు పురిటి నొప్పులు వచ్చాయి.
అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి - 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చిన
ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతూ 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాపకు జన్మనిచ్చిన సంఘటన బాచుపల్లి పీయస్ పరధిలో చోటుచేసుకుంది.
అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి
ఈ సందర్భంగా భర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. సుష్మను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కుకట్పల్లి జేఎన్టీయూ వద్దకు రాగానే నొప్పులు ఎక్కువైయ్యాయి. అందులో ఉన్న సిబ్బంది సహాయంతో సుష్మ అంబులెన్స్‌లోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమం. తదుపరి చికిత్స కోసం తల్లిబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : కాలుష్య కోరల్లో పారిశ్రామికవాడ