తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ కోసం పురుగుల మందు తాగిన తల్లీకూతుళ్లు - mother and daughter suicide attempt for phone in amberpet

హైదరాబాద్​ అంబర్​పేట పోలీస్​స్టేషన్​ పరిధిలో చరవాణి విషయమై గొడవ పడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగు మందు తాగారు. పరిస్థితి విషమించడంతో తల్లి మృతి చెందగా.. కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

mother and daughter suicide attempt for phone in amberpet
చరవాణి విషయంలో పురుగు మందు తాగిన తల్లీకూతుళ్లు

By

Published : Jul 10, 2020, 12:16 PM IST

చరవాణి విషయమై గొడవ పడ్డ తల్లీకూతుళ్లు ఆవేశంలో ఒకరి తర్వాత మరొకరు పురుగు మందు తాగారు. పరిస్థితి విషమించడంతో తల్లి మృతి చెందగా.. కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్​ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. గోల్నాక జైస్వాల్‌గార్డెన్‌లో నివాసం ఉండే శ్రీనివాస్‌, నీరజ(39) దంపతులు. వీరికి కుమార్తె భువనేశ్వరి (18), కుమారుడు దీపక్‌సాయి ఉన్నారు. పని నిమిత్తం శ్రీనివాస్‌ బుధవారం రాత్రి నాదర్‌గుల్‌ వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో చరవాణి విషయంలో తల్లీకూతుళ్లు గొడవ పడ్డారు.

ఈ క్రమంలో నీరజ ఆవేశంతో పురుగు మందు తాగారు. భువనేశ్వరి కూడా తాగడంతో.. ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. 108కు సమాచారం ఇవ్వడంతో ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 6 గంటలకు తల్లి మరణించారు. కుమార్తె చికిత్స పొందుతోంది. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండిఃప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయం.. జంకుతున్న అధికారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details