తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరబండలో దోమల బెడద తీర్చేవారెవరు...?

వర్షాకాలంలో దోమల దాడితో బోరుమంటున్నారు బోరబండ వాసులు. కాలనీలో అపరిశుభ్రత వల్ల దోమల అధికంగా ఉంటున్నాయని వీటివల్ల విషజ్వరాలు అంటువ్యాధులు వస్తున్నాయని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. మున్సిపల్​ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తోన్నారు.

By

Published : Aug 24, 2019, 6:01 PM IST

బోరబండలో దోమల బెడద.

నగరంలో వర్షం పడితే చాలు విష జర్వాలు అంటుకుంటున్నాయి.ముఖ్యంగా బోరబండ డివిజన్​లోని వీకర్​సెక్షన్ కాలనీలో దోమలు ఎక్కువ అని సంబంధిత మున్సిపల్ అధికారులు వీటి నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఎక్కడపడితే అక్కడ మురుగు నీరు ప్రవహించడంతో పాటు వీకర్ సెక్షన్ బస్తీల్లో చెత్తాచెదారం అపరిశుభ్రత వల్ల పిల్లలు పెద్దలు అస్వస్థతకు గురవుతున్నారని వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్లు దీనిపై స్పందించి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

బోరబండలో దోమల బెడద.

ABOUT THE AUTHOR

...view details